Fri Dec 05 2025 14:57:03 GMT+0000 (Coordinated Universal Time)
Vijaya Sai Reddy : సాయిరెడ్డి సూట్ కేసు సర్దుకుంటున్నారా? ఏపీకి పయనమవుతున్నారా?
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది

మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. రాజకీయాలకు సన్యాసం చెప్పి తాను వ్యవసాయం చూసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డికి తిరిగి పాలిటిక్స్ పై మోజు పెరిగిందంటున్నారు. ఆయన తన అత్యంత సన్నిహితుడితో కలసి మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. అయితే వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరిగింది. కానీ సాయిరెడ్డి ఇప్పటి వరకూ ఆ పార్టీలో చేరలేదు. బీజేపీ అయినా ఆయనను కాదనుకుని ఉండాలి. లేకుంటే అది ప్రచారానికే పరిమితమయి ఉండాలి.
వైసీపీలోకి నో ఛాన్స్...
కానీ విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీలో చేరే అవకాశాలు ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో విజయసాయిరెడ్డి ఇచ్చిన లీకులు కావచ్చు. తర్వాత వైఎస్ షర్మిలతో భేటీ అవ్వడంతో జగన్ పార్టీలోకి రీఎంట్రీ అనేది జరగని పని అని అందరూ అభిప్రాయపడుతున్నారు. అందులో వైఎస్ జగన్ విషయంలో సాయిరెడ్డిని తిరిగి చేర్చుకునేది ఉండకపోవచ్చు. విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాత ఏపీ మద్యం కేసులో రాజ్ కేసిరెడ్డి పేరు బయటకు రావడంతో పాటు పలు రకాల ఆరోపణలు చేయడం, జగన్ పై కోటరీ అంటూ విమర్శలు చేయడంతో విజయసాయిరెడ్డిని జగన్ పార్టీలోకి తిరిగి చేర్చుకునే అవకాశాలుండకపోవచ్చు.
ఆప్షన్స్ రెండే రెండు...
ఇక విజయసాయిరెడ్డి టీడీపీలో చేరాలనుకున్నప్పటికీ బహుశా చంద్రబాబు నాయుడు అంగీకరించే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్ తో పాటు పార్టీపైన చేసిన విమర్శలను క్యాడర్ ఎవరూ మర్చిపోలేదు. సాయిరెడ్డిని పార్టీలో చేర్చుకుంటే క్యాడర్ నుంచే అసహనం వ్యక్తమయ్యే అవకాశముంది. ఇక ఆయనకు ఏపీలో మిగిలిన పార్టీలు ఒక రెండే రెండు. ఒకటి జనసేన రెండు కాంగ్రెస్. జనసేనలో చేరాలనుకున్నప్పటికీ అది కూడా సాయిరెడ్డికి సాధ్యం కాకపోవచ్చు. చేరినా నామమాత్రపు నేతగానే మిగిలిపోవచ్చు. ఇకపోతే మిగిలింది కాంగ్రెస్ ఒక్కటే. ఏపీలో ఏమీ లేని కాంగ్రెస్ కు వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా ఉండటంతో కీలకంగా మారే అవకాశముంటుంది. షర్మిలకు రాజకీయంగా వెన్నుదన్నుగా ఉంటారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story

