Thu Dec 18 2025 13:42:44 GMT+0000 (Coordinated Universal Time)
VijayaSaiReddy: ఎవరినీ వదలను.. గుర్తు పెట్టుకోండి: విజయసాయిరెడ్డి
ఒక మహిళా అధికారితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం

ఒక మహిళా అధికారితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే వార్తలపై విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారన్నారు. ఆమెతో తనకు అక్రమ సంబంధాన్ని అంటగట్టారని.. కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు కథనాలను ప్రచారం చేశాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై వరుసక్రమంలో బురద చల్లుతున్నారని విజయసాయి అన్నారు. తన పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. దీని వెనుక ఉన్నవాళ్లకు బుద్ధి చెపుతానని అన్నారు.
పరువునష్టం దావాతో పాటు పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతానని విజయసాయి రెడ్డి చెప్పారు. ఒక టీడీపీ నాయకుడు, ఒక మహిళ తన ఇంటికి వచ్చారని.. నేను ఉన్నానో లేదో కనుక్కుని వెళ్లడం సీసీ కెమెరాల్లో ఇది రికార్డ్ అయిందని విజయసాయి తెలిపారు. వాడు టైమ్ చెపితే తానే వాడి ఇంటికి వెళ్తానని అన్నారు. తాము ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. తోక ఆడించే వారి తోకలను తాము అధికారంలోకి వచ్చాక కట్ చేస్తామని అన్నారు.
Next Story

