Thu Apr 02 2026 11:59:48 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : విజయ పాల ధర పెంపు
ఆంధ్రప్రదేశ్ లో విజయ పాల ధరలు పెరిగాయి

ఆంధ్రప్రదేశ్ లో విజయ పాల ధరలు పెరిగాయి. లీటరుపై రెండు రూపాయలు, పెరుగు బకెట్లపై 30 రూపాయల వరకు...స్టాండర్డ్ పెరుగు బకెట్ పై 40 రూపాయలవరకూ పెంచింది. ఈ మేరకు కృష్ణా మిల్క్ యూనియన్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏడు ర కాల పాలపై లీటరుకు రెండు రూపాయలు పెంచారు. పెరుగు బకెట్లపై రూ.10 నుంచి రూ.30 వరకు పెంచారు.
పెరుగుపై కూడా...
ఒక స్టాండర్డ్ మిల్క్ పెరుగు బకెట్ 10 కేజీలపై రూ.40 పెంచారు. పెంచిన ధరలు ఈనెల 4వ తే దీ నుంచి అమల్లోకి వస్తాయని, నెలవారీ కార్డులు కొన్న వారికి ఏప్రిల్ 9వ తేదీ వరకు పాత ధర లు వర్తిస్తాయని యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు.
Next Story

