Thu Dec 18 2025 13:38:37 GMT+0000 (Coordinated Universal Time)
హింసించి.. వీడియో కాల్ ద్వారా విడదల రజనికి చూపించారు
అప్పటి టౌన్ సీఐ సూర్యనారాయణ తనను హింసించి వీడియో కాల్ ద్వారా

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని, ఆమె పీఏలు నాగిశెట్టి జయ ఫణీంద్ర, రామకృష్ణ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్ పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై అట్రాసిటీ కేసు నమోదైంది.
అప్పటి టౌన్ సీఐ సూర్యనారాయణ తనను హింసించి వీడియో కాల్ ద్వారా రజనికి చూపించారని, ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న కోటి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు కేసు నమోదు చేశారు.ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులు వాట్సాప్ కాల్ ద్వారా తనను దూషించినట్టు కోటి తన ఫిర్యాదులో పేర్కొన్నారని, కాబట్టి ఇది చెల్లదని అన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో పిటిషనర్‌పై నాలుగు కేసులు ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. ఈ కేసుల్లో తమపై ఒత్తిడి తీసుకొచ్చి రాజీ కుదుర్చుకునే ఉద్దేశంతోనే తమపై తప్పుడు ఫిర్యాదు చేశారని రజని కోర్టుకు తెలిపారు. దీంతో ముందస్తు బెయిలు ఇవ్వాలని రజని తన పిటిషన్లో పేర్కొన్నారు.
Next Story

