Thu Mar 19 2026 04:17:47 GMT+0530 (India Standard Time)
ఏలూరులో నేడు వెంకయ్య పర్యటన
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు ఏలూరుకు రానున్నారు. ఏలూరులోని సీఆర్ఆర్ కళాశాల 75 వసంతాల వేడుకలో పాల్గొంటారు.

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు ఏలూరుకు రానున్నారు. ఏలూరులోని సీఆర్ఆర్ కళాశాల 75 వసంతాల వేడుకలో పాల్గొంటారు. సాయంత్రం జరిగే వేడుకల్లో వెంకయ్య పాల్గొననున్నారు. సీఆర్ఆర్ కళాశాలలో జరిగే వేడుకలో ముఖ్యఅతిధిగా పాల్గొని వెంకయ్య నాయుడు ప్రసంగించనున్నారు.
పోలీసుల భారీ బందోబస్తు...
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి రోడ్డుమార్గం ద్వారా వెంకయ్యనాయుడు వస్తుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఎక్కడికక్కడ పోలీసులు ఉండి ట్రాఫిక్ ను నియంత్రించనున్నారు.
Next Story

