Thu Mar 19 2026 04:53:11 GMT+0530 (India Standard Time)
వెంకట్రామిరెడ్డిదే విజయం
ఆంధ్ర్రప్రదేశ్ సచివాలయం సంఘం అధ్యక్షుడిగా తిరిగి వెంకట్రామిరెడ్డి ఎన్నికయ్యారు

ఆంధ్ర్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా తిరిగి వెంకట్రామిరెడ్డి ఎన్నికయ్యారు. నిన్న ఉదయం జరిగిన పోలింగ్ లో 1,162 మంది తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అర్ధరాత్రి వరకూ కౌంటింగ్ జరిగింది. వెంకట్రామిరెడ్డి తన ప్రత్యర్ది రామకృష్ణపై 288 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీకృస్ణ 20 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఆరుగురు సభ్యులు...
కార్యవర్గంలోని ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో ఆరుగురు వెంకట్రామిరెడ్డి మద్దతు దారులే గెలుపొందారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తమ సమస్యలను పరిష్కరిస్తారన్న నమ్మకంతో వెంకట్రామిరెడ్డిని మరోసారి ఉద్యోగులు గెలిపించుకున్నారని చెబుతున్నారు.
Next Story

