Tue Jun 06 2023 12:08:40 GMT+0000 (Coordinated Universal Time)
ఆనం మరోసారి ఫైర్.. అలా చేస్తే?
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మరోసారి జిల్లాల ఏర్పాటు పై మండి పడ్డారు.

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మరోసారి జిల్లాల ఏర్పాటు పై మండి పడ్డారు. శాస్త్రీయంగా జిల్లాల విభజన జరగలేదన్నారు. వెకంటగిరి నియోజకవర్గాన్ని చీల్చి ప్రయోజనం పొందాలనుకుంటే అది కుదరని పని అని ఆనం తన ప్రత్యర్థులను హెచ్చరించారు. నెల్లూరును మూడు జిల్లాలను చేసినా తమ కుటుంబ పరపతి ఏమాత్రం తగ్గదని ఆనం రామనారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు.
వాళ్ల స్థాయి తనది కాదు....
జిల్లాల విభజన పై కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, దానిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. వారికి సమాధానం చెప్పే స్థాయి తనది కాదని అన్నారు. అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానం తో కొందరు మాట్లాడటం సరికాదని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే జిల్లాల విభజన చేయాలని ఆనం డిమాండ్ చేశారు.
Next Story