Sat Apr 11 2026 13:54:36 GMT+0530 (India Standard Time)
TDP : వేమిరెడ్డి భలే ప్లాన్ వేశారే...మరి చివరకు వర్క్ అవుట్ అవుతుందా?
TDP : వేమిరెడ్డి భలే ప్లాన్ వేశారే...మరి చివరకు వర్క్ అవుట్ అవుతుందా?

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గేమ్ ప్లాన్ రెడీ చేసినట్లుంది.మంత్రివర్గ విస్తరణలో తన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి చోటు దక్కించుకునేందుకు ఆయన కొంత ఈ ప్రచారాన్ని చేసినట్లు నెల్లూరు టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను అయోధ్య రామిరెడ్డి ద్వారా జగన్ తిరిగి పార్టీలోకి రమ్మని ఆహ్వానించినట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అయితే తాను జగన్ ను కలిసేందుకు తాను నిరాకరించానని కూడా చెప్పారు.
తాను జగన్ ను కలవలేదని...
కానీ మొన్నటి మీడియా సమావేశంలో తాను జగన్ ను కలవలేదని చెప్పిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందులో వాస్తవం ఉంది. ఎందుకంటే జగన్ ను కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ ఫొటోలు వైసీపీ నేతలు బయట పెట్టేవారు. జగన్ ను కలవనంత వరకూ ఓకే. కానీ తాను వైసీపీలోకి వచ్చే అవకాశంలేదని, తాను టీడీపీలో గౌరవంగా ఉన్ననని, చంద్రబాబు, లోకేశ్ లు తనను అన్నిరకాలుగా అభిమానిస్తున్నందున తాను టీడీపీని విడిచి రాలేనని అయోధ్య రామిరెడ్డికి చెప్పినట్లు చెబుతున్నారు.
తనను పిలిచినప్పటికీ...
దీంతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ అంటే తనకు గౌరవం ఉంది కానీ ప్రస్తుతం రాలేనని నిరాకరించినట్లు వేమిరెడ్డి దాన్ని కన్ఫామ్ చేసినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఎన్నికలు జరిగి ఇంకా రెండు సంవత్సరాలు కూడా కాలేదు. ఇప్పుడే అధికార పార్టీ నుంచి ఎలాంటి ఫిరాయింపులు ఉండవు. ఎన్నికలకు ఆరు నెలల ముందు లేకపోతే ఒక సంవత్సరం ముందు మాత్రమే అవి జరుగుతాయి. జగన్ కు ఆ మాత్రం తెలియదా? ఇప్పటినుంచి ఎందుకు ప్రయత్నిస్తారు? అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా తనకు తానే ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ సోషల్ మీడియాలోనే హల్ చల్ చేస్తుండటం విశేషం.
Next Story

