Sat Mar 07 2026 19:34:45 GMT+0530 (India Standard Time)
నేషనల్ హైవే పై ట్రాఫిక్.. పండగ ముగియడంతో?
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగియడంతో తిరిగి హైదరాబాద్ ప్రయాణమవ్వడంతో రద్దీ పెరిగింది. ప్రధానంగా టోల్ ప్లాజాల వద్ద అధిక రద్దీ కన్పిస్తుంది. టోల్ ప్లాజా నిర్వాహకులు విజయవాడ నుంచి వచ్చే దారిలో నగదు చెల్లింపు కేంద్రాలను ఎక్కువ సంఖ్యలో పెట్టినా రద్దీ మాత్రం ఎక్కువగానే ఉంది.
పండగ ముగియడంతో...
సంక్రాంతి పండగకు సొంత వాహనాలలో ఎక్కువమంది తమ గ్రామాలకు వెళ్లారు. కరోనా కారణంగా సొంత వాహనాలే బెటర్ అని భావించి వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం రద్దీ మరీ ఎక్కువయింది. దీంతో పంతంగి, కొర్లపాడు టోల్ ప్లాజా వల వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సిబ్బందితో పాటు పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. సాధారణ రోజుల కంటే భారీగా వాహనాల సంఖ్య పెరిగింది.
Next Story

