Fri Dec 05 2025 12:29:33 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తీరం దాటిన వాయుగుండం
ఆంధ్రప్రదేశ్లో వాయుగుండం తీరం దాటింది. తిరుపతి జిల్లా తడ వద్ద తీరాన్ని దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది

ఆంధ్రప్రదేశ్లో వాయుగుండం తీరం దాటింది. తిరుపతి జిల్లా తడ వద్ద తీరాన్ని దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం గడచిన ఆరు గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో కదిలిందని, తర్వాత తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడిందని కూడా చెప్పింది.
ఈ ప్రభావంతో...
దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తమిళనాడులో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వాయుగుండం తీరం దాటడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు ముందుగానే తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది
Next Story

