Wed Dec 17 2025 14:13:17 GMT+0000 (Coordinated Universal Time)
కేశినేని నానిని కలిసిన వసంత
వసంత నాగేశ్వరరావు తాజాగా టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిని కలవడం చర్చనీయాంశమైంది

మైలవరం వైసీపీ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వసంత నాగేశ్వరరావు తాజాగా టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిని కలవడం చర్చనీయాంశమైంది. ఆయన కేశినేని నాని కలసి పలు విషయాలపై చర్చించారు. కేశినేని నాని తాత కేశినేని వెంకయ్యతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నట్లు కేశినేని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
తండ్రి తలనొప్పిగా...
దీంతో పాటు కేశినేని నానితో సామాజిక, రాజకీయ అంశాలను చర్చించారు.రాజకీయాలకు అతీతంగా కేశినేని నాని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ఆయన ప్రశంసించారు. నిబద్ధత, నిజాయితీ కలిగిన నాయకుడు కేశినేని నాని అని ఆయన ప్రశంసలు కురిపించాడు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు మరోసారి వసంత నాగేశ్వరరావు తలనొప్పి తెచ్చి పెట్టినట్లయింది. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమతో పొసగని ఇద్దరూ కలవడం కూడా పొలిటికల్ గా కొంత రెండు పార్టీల్లో హాట్ టాపిక్ అయింది.
Next Story

