Fri Dec 05 2025 11:15:39 GMT+0000 (Coordinated Universal Time)
దీక్షకు దిగిన వర్ల రామయ్య
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీలో కించపర్చినందుకు నేడు టీడీపీ నేత వర్ల రామయ్య దీక్ష చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీలో కించపర్చినందుకు నేడు టీడీపీ నేత వర్ల రామయ్య దీక్ష చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులను అవమానించడంతో ఆయన కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తన భార్యతో దీక్షకు దిగారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ పన్నెండు గంటల పాటు దీక్ష చేయనున్నట్లు వర్ల రామయ్య తెలిపారు.
క్షమాపణలు చెప్పాలంటూ....
వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ శృతి మించిపోతున్నాయని, ప్రతిపక్ష నేతకు సరైన గౌరవం ఇవ్వకుండా అవమానించడమేంటని వర్ల రామయ్య ప్రశ్నిస్తున్నారు. వైసీసీ నేతలు చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి క్షమాపణ చెప్పాలని వర్ల రామయ్య కోరారు.
- Tags
- varla ramaiah
- tdp
Next Story

