Wed Mar 18 2026 15:07:22 GMT+0530 (India Standard Time)
పన్నెండు వేల మందికి చీరలు పంపిన పవన్
పిఠాపురం శ్రీ ఉమా కుక్కటేశ్వరస్వామి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాలు నేడు నిర్వహించనున్నారు. పవన్ కల్యాణ్ చీరలు పంపారు

పిఠాపురం శ్రీ ఉమా కుక్కటేశ్వరస్వామి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాలు నేడు నిర్వహించనున్నారు. జనసేన అధ్వర్యంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించునున్నారు. పాదగయ పుణ్యక్షేత్రానికి అధికసంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు. వరలక్ష్మి వ్రతంలో ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి కూడా పాల్గొన్నారు.
సామూహిక వరలక్ష్మి వ్రతాలు...
పూజా కార్యక్రమం అనంతరం మహిళా భక్తులకు చీర, కుంకుమ కిట్లు పంపిణీ చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పన్నెండు వేలమందికి చీరలను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంపారు. వాటిని నేడు అందరికీ పంపిణీ చేయనున్నారు. ఉదయం 6గంట నుంచి నాలుగు విడతలుగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు.
Next Story

