Thu May 16 2024 19:50:31 GMT+0000 (Coordinated Universal Time)
గన్ మెన్లు వద్దంటున్న రాధా
వంగవీటి రాధా తనకు గన్ మెన్లు అవసరం లేదని పోలీసులకు చెప్పారు
వంగవీటి రాధా తనకు గన్ మెన్లు అవసరం లేదని పోలీసులకు చెప్పారు. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము గన్ మెన్లను పంపుతామని ఉన్నతాధికారులు చెప్పారు. తనపై హత్యకు కుట్ర జరిగిందని వంగవీటి రాధా చేసిన ఆరోపణలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వంగవీటి రాధా ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
పోలీసు అదుపులో...
రాధాపై హత్యకు రెక్కీ జరిగిన విషయాన్ని గురించి రాధా సన్నిహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గన్ మెన్లు ఉదయం వచ్చి బందరు రోడ్డు పార్టీ కార్యాలయంలో వేచి చూస్తున్నారు. వంగవీటి రాధా ఈరోజు తన కార్యాలయానికి రాలేదు. గన్ మెన్లు వద్దని రాధా చెప్పడం, తాము పంపుతామని పోలీసులు చెప్పడం జరిగింది. అయితే వంగవీటి రాధా పై హత్యకు కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు గుణదలకు చెందిన ఒక కార్పొరేటర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
Next Story