Wed Mar 18 2026 06:45:40 GMT+0530 (India Standard Time)
పోలీసు అధికారులకు సమాచారమిస్తా
తన హత్యకు కుట్ర జరిగిన మాట వాస్తవమేనని, పోలీసులు తనను సంప్రదిస్తే పూర్తి వివరాలు అందిస్తానని వంగవీటి రాధా తెలిపారు.

తన హత్యకు కుట్ర జరిగిన మాట వాస్తవమేనని, పోలీసులు తనను సంప్రదిస్తే పూర్తి వివరాలు అందిస్తానని వంగవీటి రాధా తెలిపారు. తాను నిత్యం ప్రజల్లో ఉంటానని, అందుకే గన్ మెన్ లు వద్దన్నానని ఆయన తెలిపారు. తనకు అన్ని పార్టీల నేతలు ఫోన్లు చేసి సంఘీభావం తెలిపారన్నారు. తనకు అన్ని పార్టీల్లో మంచి మిత్రులున్నారని, వారు తన క్షేమాన్ని కోరుకుంటారని వంగవీటి రాధా తెలిపారు.
ప్రజల్లోనే ఉంటా....
పోలీసు అధికారులు ఎవరూ తనతో ఇంతవరకూ మాట్లాడలేదని చెప్పారు. వారు సంప్రదిస్తే తన వద్ద ఉన్న సమాచారాన్ని వారికి ఇస్తానని వంగవీటి రాధా చెప్పారు. తాను భయపడే వ్యక్తిని కాదని, ప్రజల్లోనే ఉంటానని ఆయన తెలిపారు
Next Story

