Fri Dec 05 2025 15:26:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వంగవీటి రంగా వర్ధంతి.. విశాఖలో కాపునాడు
నేడు ఆంధ్రప్రదేశ్ లో వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాలను జరపనున్నారు. రంగా విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళుర్పించనున్నారు

నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాలను జరపనున్నారు. రంగా విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళుర్పించనున్నారు. రంగా వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీ నేతలు ఎవరికి వారే విడివిడిగా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మరో వైపు ఈరోజు విశాఖలో కాపునాడు సభను ఏర్పాటు చేశారు.
విశాఖలో కాపునాడు...
విశాఖలో జరుగుతున్న కాపునాడు మహాసభకు అన్ని పార్టీల వారినీ ఆహ్వానించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాపులు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తారంటున్నారు. ప్రధానంగా కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయమై చర్చకు వచ్చే అవకాశముంది. అయితే ఈ సభకు ఎవరు వస్తారు? ఏ ఏ పార్టీల నేతలు హాజరవుతారు? ఏఏ అంశాలపై చర్చిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

