Sat Jan 31 2026 21:29:05 GMT+0000 (Coordinated Universal Time)
వైభవంగా వంగవీటి జయంతి వేడుకలు
విజయవాడలో వంగవీటి మోహనరంగా 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి

విజయవాడలో వంగవీటి మోహనరంగా 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రంగా విగ్రహానికి వంగవీటి రాధా పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల పెన్నిధిగా వంగవీటి రంగా అందరి వాడు అని ఆయన అన్నారు. కేవలం విజయవాడకు వ్యక్తిగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరి అభిమానం పొందిన నేతగా వంగవీటి రంగా గుర్తింపు పొందారని ఈ సందర్భంగా రాధా అన్నారు.
వ్యక్తి కాదు.. శక్తి....
నేడు రాష్ట్ర వ్యాప్తంగా రంగా జయంతి వేడుకలను ఆయన అభిమానులు జరుపుకుంటున్నారన్నారు. తన తండ్రి రంగా ఆశయాలను కొనసాగిస్తానని రాధా చెప్పారు. ఆయన కొడుకుగా పుట్టడం తన అదృష్టమని చెప్పారు. రంగా ఒక వ్యక్తి కాదు అని, శక్తి అని అన్నారు. రంగా కేవలం ఒక సామాజికవర్గానికి చెందిన నేత మాత్రమే కాదని, బడుగు బలహీన వర్గాల వెన్నంటి నిలిచి వారికి అండగా నిలిచారని వంగవీటి రాధా తెలిపారు.
Next Story

