Thu Mar 19 2026 00:17:25 GMT+0530 (India Standard Time)
హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలను స్వీకరించారు

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని సెకండ్ బ్లాక్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వంగలపూడి అనిత బాధ్యతలను స్వీకరించారు. హోంమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వంగలపూడి అనితకు వేదపండితులు ఆశీర్వచనాలు అందచేశారు.
పార్టీనేతలు, అధికారులు...
హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో వంగలపూడి అనితను పార్టీ నేతలతో పాటు ఉన్నతాధికారులు కలసి అభినందనలు తెలిపారు. బొకేలను అందించి ఆమెకు శుభాకాంక్షలను అందించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక మహిళ హోం మంత్రిగా బాధ్యతలను స్వీకరించడం ఇదే తొలిసారి. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Next Story

