Thu Mar 19 2026 06:27:32 GMT+0530 (India Standard Time)
విజయవాడ - విశాఖ మధ్య నాలుగు గంటలే
వందేభారత్ రైలు ఆంధ్రప్రదేశ్ లో కూడా పరుగులు తీయనుంది. విశాఖపట్నం నుంచి విజయవాడకు వందేభారత్ రైలు పరుగులు తీయనుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వందేభారత్ రైలు ఆంధ్రప్రదేశ్ లో కూడా పరుగులు తీయనుంది. విశాఖపట్నం నుంచి విజయవాడకు వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. దీంతో విశాఖపట్నం నుంచి విజయవాడ కు మధ్య ప్రయాణం నాలుగు గంటలు మాత్రమేనని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.
ట్రయల్ రన్ లో...
ఈ సెమీ హైస్పీడ్ రైలు మొదటి దశలో విశాఖపట్నం నుంచి పరుగులు తీయడానికి సిద్ధంగా ఉంది. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను ప్రతి రాష్ట్రానికి కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. బీజీ రూట్లలో ఈ రైలును అధికారులు ప్రవేశపెడుతూ వస్తున్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది.
Next Story

