Thu Mar 19 2026 05:08:14 GMT+0530 (India Standard Time)
తిరుపతికి వందేభారత్ ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలు త్వరలో ప్రారంభం కాబోతుంది

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలు త్వరలో ప్రారంభం కాబోతుంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ రైలు ప్రారంభమవుతుంది. కేవలం 8.30 గంటల్లోనే తిరుపతికి ఈ రైలు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజులూ ఈ రైలు అందుబాటులో ఉండనుంది. ఏప్రిల్ 8న ప్రారంభించినా 9వ తేదీన ఈ రైలు తిరుపతికి బయలుదేరి వెళుతుంది.
మంగళవారం మినహాయించి...
ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్కు రాత్రి 11.45 గంటలకు చేరుకుంటుంది. నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. ఏప్రిల్ 9న ఈ రైలు తిరుపతి నుంచి ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు.
Next Story

