Fri Feb 27 2026 10:21:52 GMT+0530 (India Standard Time)
వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం
వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భారీగా ఆదాయం లభించింది.

కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం జరిగిన హుండీల లెక్కింపు కార్యక్రమంలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. మొత్తం 2.17 కోట్ల ఆదాయం లభించింది. గత 35 రోజుల కాలానికి గాను ఈ మొత్తం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయం మరియు శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల ద్వారా రూ.1,58,00,536 ల నగదు వచ్చింది.
వివిధ హుండీల ద్వారా...
అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.59,82,822ల నగదు లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా భక్తులు సమర్పించిన కానుకలుగా 42 గ్రాముల 400మిల్లీ గ్రాముల బంగారం, కిలో 280 గ్రాముల వెండి, అలాగే 13 దేశాలకు చెందిన 73 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలలో లభించాయని ఆలయ అధికారులు తెలిపారు. ప్రతి శనివారం వాడపల్లిలో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.
Next Story

