Thu Mar 19 2026 07:05:57 GMT+0530 (India Standard Time)
వచ్చే నెల 4న పోలవరానికి కేంద్రమంత్రి
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ వచ్చే నెల 4వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ వచ్చే నెల 4వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆయన తొలిసారి ప్రాజెక్టుకు వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన అధికారులతో సమీక్షించనున్నారు. కేంద్ర మంత్రి పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రాజెక్టు విషయంలో.....
పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కావడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వీలయినంత త్వరగా తెచ్చి పూర్తి చేయాలని భావిస్తుంది. పునరావసం, నష్టపరిహారం విషయంలోనూ కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అయితే కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తుండటంతో మంత్రి సానుకూలంగా స్పందిస్తారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.
Next Story

