Fri Dec 05 2025 13:38:30 GMT+0000 (Coordinated Universal Time)
సిక్కోలులో బీచ్ ఫెస్టివల్
సోంపేట మండలం బారువలో బీచ్ ఫెస్టివల్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ప్రారంభించారు

సోంపేట మండలం బారువలో బీచ్ ఫెస్టివల్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ప్రారంభించారు. ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలను సముద్రంలో వదిలి ఫెస్టివల్ ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ బీచ్ ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశముండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలను కూడా కల్పించారు.
తాబేళ్ల సంరక్షణ...
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, ప్రభుత్వ విప్ అశోక్ లు పాల్గొన్నారు. ఒకవైపు పర్యాటకరంగం అభివృద్ధి చేయడంతో పాటుగా మరొకవైపుఅంతరించిపోతున్న ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ ధ్యేయంగా ఈ బీచ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. ప్రకృతిపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు.
Next Story

