Fri Dec 12 2025 10:25:31 GMT+0000 (Coordinated Universal Time)
సీక్కోలు వాసులకు కేంద్ర మంత్రి ఒకేసారి రెండు గుడ్ న్యూస్ లు
శ్రీకాకుళం ప్రజలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒకేసారి రెండు గుడ్ న్యూస్ లు చెప్పారు.

శ్రీకాకుళం ప్రజలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో శ్రీకాకుళంలో ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎయిర్ పోర్టు వస్తే ఇక్కడి నుంచే రాకపోకలు మరింత సులువుగా సీక్కోలు వాసులకు మారతాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. సుదూర ప్రాంతం నుంచి గంటల తరబడి రైళ్లలోనూ, బస్సుల్లోనూ ప్రయాణించే వీలు తప్పుుతుందని ఆయన అన్నారు.
వంశధార ప్రాజెక్టును...
దీంతో పాటు వంశధార ఫేజ్ 2 పనులను కూడా పూర్తి చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. 2025 నాటికి వంశథార ఫేజ్ 2 పనులను పూర్తి చేస్తామని చెప్పారు. దీంతో ఇటు వంశధార ప్రాజెక్టు, మరోవైపు ఎయిర్ పోర్టు ఒకే సారి రెండు గ్యూస్ లను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు చెప్పారు.
Next Story

