Thu Mar 19 2026 11:58:20 GMT+0530 (India Standard Time)
జగన్ ఇంటికి గడ్కరీ.... అందుకేనట?
కేంద్ర మంత్రిగడ్కరీ తాడేపల్లిలోని జగన్ నివాసానికి నిన్న వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆయన చాలా సేపు జగన్ నివాసంలో ఉన్నారు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాడేపల్లిలోని జగన్ నివాసానికి నిన్న వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆయన చాలా సేపు జగన్ నివాసంలో ఉన్నారు. ఇద్దరూ రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చించారని చెబుతున్నారు. నిన్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి గడ్కరీ విజయవాడకు వచ్చారు. ఆయనతో పాటు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వచ్చారు.
ఒక్కరే వెళ్లడం
అయితే నితిన్ గడ్కరీ ఒక్కరే జగన్ నివాసానికి వచ్చారు. విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత గడ్కరీ జగన్ ఇంటికి వెళ్లారు. 2024 ఎన్నికలకు సంబంధించి వారి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కాసేపు ముచ్చటించుకున్నారు. జగన్ఈ సందర్భంగా నితిన్ గడ్కరీని శాలువతో సత్కరించి జ్ఞాపికను అందచేశారు.
Next Story

