Wed Mar 18 2026 12:42:32 GMT+0530 (India Standard Time)
విజయవాడలో నేడు కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో సోము వీర్రాజు ఘన స్వాగతం పలికారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఘన స్వాగతం పలికారు. ఈరోజు కిషన్ రెడ్డి కృష్ణా జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్టొననున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం ఫొటోగ్రాఫర్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో కిషన్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కేఎల్ యూనివర్సీలో జరిగే కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొంటారు.
పింగళి వెంకయ్య...
అనంతరం సాయంత్రం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కిషన్ రెడ్డి జాతీయ జెండా రూప కర్త అయిన పింగళి వెంకయ్య స్వగ్రామం భట్ల పెనుమర్రులో జరిగే జాతీయ పతాక ఆవిష్కరణలో పాల్గొంటారు అనంతరం తిరిగి రాత్రికి ఆయన ఢిల్లీ పయనమయి వెళతారు. కిషన్ రెడ్డి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story

