Wed Jan 21 2026 10:12:32 GMT+0000 (Coordinated Universal Time)
రేపు విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ?
రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో రేపు కేంద్ర హోంశాఖ సమావేశం కానుంది. విభజన సమస్యలపై రేపు చర్చించనుంది.

రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో రేపు కేంద్ర హోంశాఖ సమావేశం కానుంది. విభజన సమస్యలపై రేపు చర్చించనుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ రెండు తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు అజెండాను పంపింది. ఈ సమావేశంలో ఏడేళ్లుగా నెలకొన్న విభజన సమస్యలపై చర్చించనున్నారు.
ఏడేళ్ల నుంచి....
ఏపీ విభజన సమస్యలతో పాటు, ఏపీ భవన్, 9,10 షెడ్యూల్ వంటి అంశాలపై రెండు రాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర హోంశాఖ చర్చించనుంది. గత కొన్నేళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు ఈ సమావేశంలో ఒక కన్ క్లూజన్ తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతో రేపటి సమావేశంపై ఆసక్తి నెలకొంది.
Next Story

