Fri Dec 05 2025 11:28:32 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు రాష్ట్రాల్లో ఈ పథ్నాలుగు ప్రాంతాలకు వెళితే జాగ్రత్త
పహాల్గాం ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది

పహాల్గాం ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. పౌరులు కూడా అలెర్ట్ గా ఉండాలని సూచించింది. హై అలెర్ట్ గా ఉండాల్సిన ప్రాంతాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ పథ్నాలుగు చోట్ల పహారా పెంచాలని సూచిచింది. ఈ పథ్నాలుగు ప్రాంతాలను హై అలెర్ట్ జోన్ లుగా నిర్ణయించింది. అక్టోపస్ బలగాలను ఈ ప్రాంతంలో దించాలని నిర్ణయించింది. ఈ పథ్నాలుగు ప్రాంతాల్లో అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని, భారీ బందోబస్తుతో పాటు నిరంతరం నిఘా పెట్టాలని సూచించిది.
హై అలెర్ట్ జోన్ గా...
హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేసన్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూకట్ పల్లి, నాంపల్లి, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, ట్యాంక్ బండ్, తిరుమలతో పాటు అలిపిరి, విశాఖపట్నంలోని రైల్వేస్టేషన్, ఆర్కేబీచ్, జగదాంబ జంక్షన్, విజయవాడలోని రైల్వే స్టేషన్, పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్, మహాత్మాగాంధీరోడ్డు ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచాలని సూచించింది. ఈ ప్రాంతంలో ప్రజలు కూడా ఎక్కువగా గుమికూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Next Story

