Tue Mar 17 2026 16:52:53 GMT+0530 (India Standard Time)
అమిత్ షా ఏపీ పర్యటన వాయిదా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. ఈ నె 8వ తేదీన అమిత్ షా కర్నూలు, అనంతపురం జిల్లలో పర్యటించాల్సి ఉంది. అయితే అదే రోజున కర్ణాటకలో కార్యక్రమాల్లో పాల్గొని రావాల్సి ఉండటంతో ఏపీ పర్యటను అమిత్ షా వాయిదా వేసుకున్నారు. బీజేపీ నేతలు అమిత్ షా పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడెక్కడ షా పాల్గొనేది కూడా బీజేపీ నేతలు మీడియాకు తెలిపారు.
ఈ నెల 8న...
ఈ నెల 8న కర్నూలులో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అనంతరం కార్యకర్తలతో సమావేశమవుతారని ప్రకటించారు. అనంతరం అక్కడి నుంచి హిందూపురం జిల్లాకు బయలుదేరి పుట్టపర్తిలో బహిరంగ సభలో పాల్గొంటారని, అనంతరం సత్యసాయి బాబా ఆశ్రమాన్ని సందర్శిస్తారని చెప్పారు. కానీ కర్ణాటక పర్యటన కారణంగా అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. తిరిగి ఎప్పుడు ఆయన పర్యటిస్తారన్నది త్వరలో ప్రకటించనున్నారు.
Next Story

