Fri Dec 05 2025 19:13:59 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : నేడు తిరుమలకు అమిత్ షా
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు తిరుమలకు రానున్నారు. ఆయన రాత్రికి తిరుమలలో బస చేయనున్నారు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు తిరుమలకు రానున్నారు. ఆయన రాత్రికి తిరుమలలో బస చేయనున్నారు. రేపు ఉదయం తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఎన్నికల ప్రచారం నేటితో పూర్తి కావడంతో సాయంత్రానికి ఆయన తిరుమలకు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రేపు దర్శనం...
అమిత్ షా గత కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని రాష్ట్రాలనూ చుట్టి వచ్చారు. కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకూ పర్యటించిన అమిత్ షా ఎన్నికల ప్రచారం ముగియడంతో ఒకరోజు తిరుమల శ్రీవారి సన్నిధిలో గడపాలని నిర్ణయించుకున్నారు. ప్రచారంలో అలసిపోయిన ఆయన శ్రీవారిని దర్శించుకుని కొంత స్వాంతన పొందేందుకు తిరుమల వస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
Next Story

