Fri Dec 05 2025 16:37:47 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : రేపు ధర్మవరానికి అమిత్ షా
రేపు ధర్మవరం నియోజకవర్గానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు.

రేపు ధర్మవరం నియోజకవర్గానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ధర్మవరం లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం హెలికాప్టర్ లో ధర్మవరం చేరుకుంటారు. బిజెపి జాతీయ కార్యదర్శి, ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి వై సత్య కుమార్ కు మద్దతుగా అమిత్ షా ప్రచారంలో పాల్గొంటారు.
బహిరంగ సభలో...
ధర్మవరం బత్తలపల్లి రోడ్డు లో ని సిఎన్ బి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అమిత్ షా తో పాటు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి, బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ బహిరంగ సభ లో ప్రసంగిస్తారని బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం ఒక ప్రకటనలో పేర్కొన్నారు
Next Story

