Thu Jan 29 2026 00:07:50 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తిరుమలలో వరస ఘటనలపై కేంద్ర హోంశాఖ సీరియస్
తిరుమలలో వరసగా జరుగుతున్న ఘటనలపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది.

తిరుమలలో వరసగా జరుగుతున్న ఘటనలపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. అన్ని ఘటనలపై నివేదిక ఇవ్వాలని టీటీడీని కేంద్ర హోం శాఖ కోరింది.రేపు, ఎల్లుండి తిరుమలలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ పర్యటించనున్నారు. ఆయన అధికారులతో సమావేశమై ఇటీవల జిరిగిన ఘటనలపై ఆరా తీయనున్నారు.
వరస ఘటనలతో...
ఇటీవల తిరుమల వైకుంఠం ద్వార దర్శనం టోకెన్ల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన ఘటనతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. అదే సమయంలో లడ్డూ కౌంటర్ లో అగ్ని ప్రమాద ఘటనపై కూడా వివరణ కోరినట్లు తెలిసింది. దీంతో పాటు వరసగా పలు ఘటనలు తిరుమలలో జరుగుతుండటంపై కేంద్ర హోం శాఖ ఆరా తీసినట్లు తెలిసింది. దీనిపై టీటీడీని నివేదిక కోరింది.
Next Story

