Wed Mar 18 2026 20:57:58 GMT+0530 (India Standard Time)
సమీర్ శర్మ పదవీ కాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసకుంది.

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసకుంది. సమీర్ శర్మ పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగించాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
మరో ఆరు నెలలు...
ఏపీ ప్రభుత్వం రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మే నెల వరకూ సమీర్ శర్మ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉంటారు.
Next Story

