Fri Dec 05 2025 18:20:53 GMT+0000 (Coordinated Universal Time)
Union Cabinet : నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం.. అజెండా ఇదే
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగునుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగునుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా బీహార్ తో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించి సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. ఈ సందర్భంగా మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేయనున్నారు.
కీలక నిర్ణయాల దిశగా...
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున మంత్రులు విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని ఆయన చెప్పనున్నారు. అంతేకాకుండా ఈ సమావేశంలో ఉద్యోగులు, రైతులు, విద్యార్థులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అలాగే కొన్ని కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అవకాశముందని అధికారికవర్గాలు వెల్లడించాయి.
Next Story

