Sun Mar 15 2026 23:14:06 GMT+0530 (India Standard Time)
TDP : ఉండి టీడీపీలో కలకలం... ఆత్మీయ సమావేశంలో
ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది. ఈ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును ఇప్పటికే పార్టీ ప్రకటించింది

ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది. ఈ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును ఇప్పటికే పార్టీ ప్రకటించింది. అయితే తాజాగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఈ సీటును ఇస్తున్నారన్న ప్రచారంతో ఉండి టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామరాజును కొనసాగించాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
కంటతడి పెట్టిన...
ఈరోజు ఉండి నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో రామరాజు కంటతడి పెట్టారు. సీటు మార్పు ఉంటుందన్న ఆందోళనలో రామరాజు ఉన్నారు. అందుకోసమే ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సీటు మార్పిడి చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు.
Next Story

