Thu Mar 19 2026 13:13:50 GMT+0530 (India Standard Time)
జగన్ నివాసంలో ఉగాది వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నివాసంలో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నివాసంలో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు జగన్ దంపతులను ఆశీర్వదించారు. తెలుగు వారి తొలి పండగను తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు ప్రత్యేకంగా ప్రసాదాలు తెచ్చి అందించారు. శుభాకృత్ నామ ఉగాది రోజున తెలుగుదనం ఉట్టిపడేలా ప్రాంగణాన్ని అలంకరించారు.
పంచాగ శ్రవణం...
వేద పండితులు పంచాగ శ్రవణాన్ని వినిపించనున్నారు. ఉగాది పచ్చడిని తయారు చేసి జగన్ దంపతులకు అందచేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి రోజా తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. పంచకట్టులో జగన్ ప్రాంగణమంతా కలియదిరిగారు. జగన్ నివాసంలో జరిగిన ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి.
Next Story

