Wed Mar 25 2026 04:12:50 GMT+0530 (India Standard Time)
నేడు ఉదయాస్తమాన సేవా యాప్ ప్రారంభం
తిరుమలలో నేడు ఉదయాస్తమాన సేవా యాప్ ను ప్రారంభించనుంది.

తిరుమలలో నేడు ఉదయాస్తమాన సేవా యాప్ ను ప్రారంభించనుంది. ఉదయాస్తమాన సేవ ను చాలా రోజుల తర్వాత భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తేనుంది. ప్రాణదాన పథకానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన భక్తులకు మాత్రమే ఉదయాస్తమాన సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించనుంది. ఈ యాప్ ద్వారా భక్తులు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
కోట విరాళం ఇచ్చిన....
ఉదయాస్తమాన సేవ యాప్ ను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందుబాటులోకి తేనుంది. స్వామి వారిని అతి దగ్గరగా చూసే వీలు ఈ సేవ ద్వారా కలుగుతుంది. దీంతో భక్తులు ఎక్కువ మంది కోటి రూపాయలు విరాళం ఇచ్చేందుకు ముందుకు వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది. ఇప్పటికే సర్వదర్శనం టోకెన్లను రోజుకు పదిహేను వేల చొప్పున టీటీడీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story

