Sun Mar 15 2026 18:39:21 GMT+0530 (India Standard Time)
మేకపాటి ఫోన్ స్విచ్ ఆఫ్
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అందుబాటులో లేకుండా పోయారు. ఆయన ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది.

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అందుబాటులో లేకుండా పోయారు. నిన్న అసెంబ్లీలో ఓటింగ్ చేసిన తర్వాత ఆయన ఎవరికి అందుబాటులో లేరు. మేకపాటి ఫోన్ కూడా స్విచాఫ్ లో ఉంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఓటింగ్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో కొందరు ఆయనకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచాఫ్ వస్తుంది. నిన్న సాయంత్రం నుంచి ఫోన్ స్విచాఫ్ వస్తుందని చెబుతున్నారు.
బెంగళూరు వెళ్లినట్లు...
ఆయన బెంగళూరు వెళ్లినట్లు చెబుతున్నారు. తన అనుచరులకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. కొన్ని రోజుల క్రితం జగన్ ను కలసినప్పుడు ఈసారి టిక్కెట్ ఇవ్వలేనని, ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ చెప్పడంతోనే ఆయన క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని చెబుతున్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనపై నమ్మకంతోనే జగన్ ఈ మాట చెప్పారంటున్నారు.
Next Story

