Sun Mar 15 2026 18:38:05 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎమ్మెల్యేకి గుండెపోటు
ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి స్వల్పంగా గుండెపోటు వచ్చింది

ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి స్వల్పంగా గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు రెండు వాల్వ్ లు మూసుకుపోయాయని నిర్ధారించారు. స్టంట్స్ వేయాలని నిర్ణయించారు.
మెరుగైన వైద్యం కోసం...
ప్రస్తుతం నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించాలని వైద్యులు సూచించారు. ఆయనను చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మేకపాటి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకుని ఉదయగిరి వైసీపీ కార్యకర్తలు పెద్దయెత్తున అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు.
Next Story

