Fri Dec 06 2024 17:36:17 GMT+0000 (Coordinated Universal Time)
మేకపాటికి మళ్లీ అస్వస్థత
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లోనే ప్రాధమికంగా చికిత్స చేయిస్తున్నారు
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెనొప్పి రావడంతో ఇంట్లోనే ప్రాధమికంగా చికిత్స చేయిస్తున్నారు. ఆయనను కుటుంబ సభ్యులు చెన్నై తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారన్న కారణంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. కొన్నాళ్లు బెంగళూరులో ఉన్న మేకపాటి రెండు రోజుల క్రితమే ఉదయగిరి వచ్చారు.
చెన్నైకి తరలించే...
నిన్న కూడా ఉత్సాహంగానే కన్పించారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకుని కూర్చుని మరీ వైసీపీలోని తన ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. అయితే ఈరోజు ఉదయం అస్వస్థతకు గురి కావడంతో ఆయనను మరోసారి చెన్నైకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. గత నెలలోనూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటు రావడంతో రెండు వాల్వ్‌లు బ్లాక్ అయినట్లు గుర్తించి చికిత్స అందించారు. తాజాగా మరోసారి గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Next Story