Fri Dec 05 2025 17:21:35 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు

రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడులను సమావేశాలు జరిగే అన్ని రోజులు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా గవర్నర్ ను వెయిట్ చేయంచారని, అది నిబంధనలకు విరుద్ధమని నిన్న పయ్యావుల కేశవ్ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి రాక ఆలస్యం కావడంతో గవర్నర్ స్పీకర్ ఛాంబర్లో గవర్నర్ ను పయ్యావుల కేశవ్ వెయిట్ చేయించారన్న ఆరోపణపై నేడు సభలో ప్రివిలైజ్ మోషన్ ఇచ్చారు.
గవర్నర్ ను అవమానపర్చేలా...
అయితే పయ్యావుల కేశవ్ దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను అన్నమాట వాస్తవమేనని చెప్పారు. గవర్నర్ కు అవమానం జరిగిందని వ్యాఖ్యానాలు చేసిన ఇద్దరిని సస్పెండ్ చేయాలని చేసిన ప్రతిపాదనను స్పీకర్ ఆమోదించారు. గవర్నర్ పై అసత్య ప్రచారం చేశారంటూ స్పీకర్ కూడా టీడీపీ సభ్యులపై మండి పడ్డారు.
Next Story

