Wed Jan 07 2026 00:47:36 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో పాలకొల్లు వాసుల మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మరణించారు.

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మరణించారు. దంపతులు కృష్ణ కిశోర్, ఆశలు ఈ ప్రమాదంలో మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కృష్ణ కిశోర్ కొన్నాళ్ల క్రితం అమెరికాకు వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా స్థిరపడ్డార. పది రోజుల క్రితమే వారు పాలకొల్లుకు వచ్చి తిరిగి అమెరికాకు వెళ్లారు.
దంపతులిద్దరూ...
అయితే వాషింగ్టన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే సమయంలో మార్గమధ్యంలోదుబాయ్ లో ఇద్దరూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో వారి కుమార్తె, కుమారుడికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అమెరికాలోని సన్నిహితుల నుంచి సమాచారం రావడంతో పాలకొల్లులోని వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
Next Story

