Sat Dec 13 2025 08:23:11 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : క్రాస్ ఓటింగ్ చేసింది ఆ ఇద్దరే
వైసీపీ ఎమ్మెల్సీ ఓడిపోవడానికి ఇద్దరు ఎమ్మెల్యేలే కారణం. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు.

వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు ఓడిపోవడానికి ఇద్దరు ఎమ్మెల్యేలే కారణమని చెబుతున్నారు. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. ఒకరు ఉండవల్లి శ్రీదేవి కాగా, మరొకరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ ఇద్దరూ క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్నది వైసీపీ నేతల నుంచి వస్తున్న సమాచారం.
వచ్చే ఎన్నికల్లో...
వారిద్దరికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు రావన్న ప్రచారం జరగడం, తాడికొండ, ఉదయగిరి నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమించడం ఓటమికి కారణమయిందని చెబుతన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి విషయంలో స్పష్టంగా తెలుస్తున్నా మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారు. అందుకే ఒక సీటును కోల్పోవాల్సి వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వీరిద్దరిపై వైసీపీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

