Tue Mar 17 2026 09:02:25 GMT+0530 (India Standard Time)
జనసేనలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు
జనసేన పార్టీలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో వీరిద్దరూ పార్టీ కండువా కప్పుకున్నారు

జనసేన పార్టీలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో వీరిద్దరూ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ శాసనసభ్యులు టీవీ రామారావులు జనసేన పార్టీలో చేరారు. రామారావు వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు.
భీమిలీ వైసీపీ నేతలు...
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో వారిద్దరూ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు భీమిలి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు చంద్రరావు, అక్రమాని దివాకర్ లు కూడా జనసేన పార్టీలో చేరారు. వీరిద్దరూ పవన్ కల్యాణ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Next Story

