Sun Feb 01 2026 18:19:32 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరు మాజీ మంత్రులకు షాకింగ్ న్యూస్
మాజీ మంత్రులు ఇద్దరికి సుప్రీంకోర్టులో ఈరోజు ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేతలకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి

మాజీ మంత్రులు ఇద్దరికి సుప్రీంకోర్టులో ఈరోజు ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ నేతలకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. సినియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. ఫోర్జరీ కేసులో అయ్యన్న పాత్రుడిని విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. దీంతో అయ్యన్నపాత్రుడిని ఫోర్జరీ కేసులో విచారించేందుకు పోలీసులకు వీలు చిక్కినట్లయింది.
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో...
ఇక మరో మాజీ మంత్రి నారాయణ పిటీషన్ ను కూడా సుప్రంకోర్టు డిస్మిస్ చేసింది. పదో తరగతి పరీక్ష పశ్నపత్రాల లీకేజీ కేసులో నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. దీంతో పదో తరగతి పేపర్ల లీకేజీ కేసులోనూ మాజీ మంత్రి నారాయణను సీఐడీ విచారించనుంది. మొత్తం మీద ఒకే రోజు సుప్రీంకోర్టులో ఇద్దరు మాజీ మంత్రలు, టీడీపీ నేతలకు ఎదురు దెబ్బతగిలిందనే చెప్పాలి. వారు ఇక విచారణకు సిద్ధం కావాలని న్యాయనిపుణులు చెబుతున్నారు.
Next Story

