Thu Mar 26 2026 11:19:14 GMT+0530 (India Standard Time)
Bus Accident : మరో ఆరుగురి పరిస్థితి విషమం : వైద్యులు
మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో ఇరవై ఆరు మంది గాయపడ్డారు

మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో ఇరవై ఆరు మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్న వారిని గుంటూరు, ఒంగోలుకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ప్రయివేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో పదమూడు మంది ఇప్పటి వరకూ మరణించారు.
గాయపడిన వారిని...
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. నిన్న సాయంత్రం ఐదు గంటలకు జగిత్యాలలో బయలుదేరిన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం వద్దకు చేరుకున్న వెంటనే ఈ ప్రమాదం జరిగింది.తెల్లవారు జామున ప్రమాదం జరగడంతో నిద్రలోనే ఎక్కువ మంది చనిపోయారు.
Next Story

