Fri Dec 05 2025 12:41:46 GMT+0000 (Coordinated Universal Time)
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ మరోసారి వాయిదా
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు

తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. సమయం మించిపోవడంతో నాలుగోసారి కూడా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఉదయం నుంచి తునిలో హైడ్రామా నడిచింది. టీడీపీకి చెందిన కౌన్సిలర్లు అందరూ కౌన్సిల్ హాలుకు చేరుకున్నా వైసీపీ కౌన్సిలర్లు మాత్రం హాజరు కాలేదు.
వైసీపీ కౌన్సిలర్లందరూ...
మాజీ మంత్రి దాడి శెట్టి రాజా తన పార్టీకి చెందిన కౌన్సిలర్లతో ఉన్నారు. ఆయన నుంచి బయటకు రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. ఇప్పటి వరకూ మూడుసార్లు వాయిదా పడటంతో నాలుగో సారి అయినా వైస్ ఛైర్మన్ ఎన్నిక జరుగుతుందని భావించారు. కానీ నేడు కూడా వాయిదా పడటంతో తిరిగి ఈ ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారన్నది తెలియాల్సి ఉంది.
Next Story

