Thu Jan 08 2026 06:51:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పరకామణి చోరీ కేసుపై హైకోర్టులో విచారణ
నేడు టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టులో విచారణ జరగనుంది

నేడు టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఎఫ్ఐఆర్ నమోదులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు పరిశీలించాలని ఇప్పటికే సీఐడీ, అవినీతి నిరోధక శాఖను ఏపీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నేడు వాదనలను హైకోర్టు విననుంది. పరకామణి చోరీ కేసుపై గతంలోనూ హైకోర్టు సీరియస్ గా పరిగణించింది. భక్తుల ఇచ్చే సొమ్ముకు భద్రత కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది.
విచారణలో భాగంగా...
అవసరమైతే ఏఐ టెక్నాలజీని వినియోగించి పరకామణిలో లెక్కింపు జరిగేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు హైకోర్టు సూచించింది. ఈ కేసులో మరికొందరిని విచారించాల్సి ఉందని సీఐడీ అధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకే నడుచుకునేలా సీఐడీ, ఏసీబీలు చర్యలు తీసుకోవాలని సూచించడంతో నేటి విచారణలో ఏం జరగనుందీ తెలియనుంది.
Next Story

