Wed Mar 25 2026 07:19:11 GMT+0530 (India Standard Time)
తిరుమలలో రెండు ఘాట్ రోడ్లు మూసివేత
తిరుమల రెండు ఘాట్ రోడ్లను టీటీడీ అధికారులు మూసివేశారు.

తిరుమల రెండు ఘాట్ రోడ్లను టీటీడీ అధికారులు మూసివేశారు. కొండచరియలు విరిగిపడుతుండటంతో రెండు ఘాట్ రోడ్లు మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. భక్తులు కొద్దిసేపు నిరీక్షించాలని టీటీడీ అధికారులు కోరారు. రెండు ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడటంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
తొలగింపు కార్యక్రమం....
విరిగిపడిన కొండచరియలను తొలగించే కార్యక్రమం ప్రారంభమయింది. తొలగింపు కార్యక్రమం పూర్తయిన వెంటనే ఘాట్ రోడ్ లోకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. తిరుపతిలోనే భక్తులు నిరీక్షిస్తున్నారు. మరో గంటలో కొండ చరియల తొలగింపు కార్యక్రమం పూర్తవుతుందని తెలిపారు.
Next Story

