Thu Jan 29 2026 18:19:51 GMT+0000 (Coordinated Universal Time)
టీటీడీ టిక్కెట్లు గంటలో క్లోజ్
జనవరి నెలకు సంబంధించి టీటీడీ ఆన్ లైన్ లో టిక్కెట్లను విడుదల చేసింది. గంటలోనే అవి అమ్ముడు పోయాయి

తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు పరితపిస్తుంటారు. ఆయన దర్శనానికి వేల మైళ్లు ప్రయాణం చేసి మరీ తిరుమల చేరుకుంటారు. ఇక దర్శనం టిక్కెట్లు ఆన్ లైన్ లో పెడితే అమ్ముడు పోకుండా ఉంటాయా? లక్ష సంఖ్యలో విడుదల చేసిన ఆన్ లైన్ టిక్కెట్లు కేవలం గంట వ్యవధిలోనే అమ్ముడు పోయాయి. అదీ తిరుమల అంటే.
జనవరి నెలకు....
జనవరి నెలకు సంబంధించి టీటీడీ ఆన్ లైన్ లో టిక్కెట్లను విడుదల చేసింది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను 1,60,000 లను విడుదల చేసింది. అయితే గంట లోపే టిక్కెట్లు అమ్ముడుపోయాయి. దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తులు టిక్కెట్లను కొనుగోలు చేశారు. కాగా జనవరి నెలకు సంబంధించి టీటీడీ ఇంకా సర్వదర్శనం టిక్కెట్లను విడుదల చేయలేదు.
Next Story

